హుజూర్ నగర్ రామస్వామి గుట్టలో మోడల్ హౌసింగ్ కాలనీ త్వరలో ప్రారంభం:

త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం రామస్వామి గుట్టలో ఇందిరమ్మ ఇండ్ల పనుల వేగంపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ దృష్టి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 18 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌసింగ్ కాలనీని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం పరిశీలించారు.సుమారు 110 ఎకరాలలో 2.160 ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతుండగా,ఈ హౌసింగ్ మోడల్ కాలనీని త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. పర్యటనలో భాగంగా అంతర్గత రహదారులు సభ స్థలం,మొక్కలు నాటడం,హెలిప్యాడ్ ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించి మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉండాలని,అర్హులైన వారికి మాత్రమే అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు.ఎటువంటి అవకతవకలు లేకుండా జాగ్రత్తగా ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీనివాస్. హౌసింగ్ పీడీ సిద్ధార్థ,ఉద్యానవన అధికారి నాగయ్య,మిషన్ భగీరథ అధికారి కరుణాకర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,తాహసిల్దార్ కవిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *