
పయనించే సూర్యుడు ,మార్చి 18 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వాటిలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు పూర్తిగా అమలు కాలేదు. ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ దృతి, వృద్ధాప్య, వితంతు మరియు దివ్యాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పదకం, రైతులకు రైతు భరోసా, భూ సమస్యల పరిష్కారం వంటి అనేక హామీలు ఇప్పటికీ అమలు కావడం లేదు. ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని ఓటు వేసిన ప్రజలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.మండలంలో రైతులు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సమయానికి అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే వృద్ధాప్య, వితంతు మరియు దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్లు అర్హులైన లబ్దిదారులకు అందడంలేదు.మండలంలో దరఖాస్తులు చేసుకున్న అనేక మంది వృద్ధులు, వికలాంగులు మరియు ఒంటరి మహిళలకు ఇప్పటికీ పెన్షన్లు మంజురు కాలేదు. అర్హులైన అభ్యర్థులందరి దరఖాస్తులను వెంటనే ఆమోదించి వారికి పెన్షన్లు అందించాలని కోరుతున్నాము.పేదలకు ప్రభుత్వం ప్రకటించిన గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన లబ్దిదారులకు వెంటనే ఇళ్లు మంజురు చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని మనవి చేస్తున్నాము.కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు దరఖాస్తులు సమర్పించినప్పటికీ వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఆ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము.గ్రామాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు మరియు వీధి దీపాలు వంటి ప్రాథమిక సదుపాయాలు సరైన విదంగా అందడం లేదు. ఈ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి.అలాగే నివాస, ఆదాయ మరియు కుల ధృవీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ పథకాలకు ఈ పత్రాలే ప్రామాణికం కావడంతో నిర్ణీత సమయంలో దృవీకరణ పత్రాలను జారీ చేసి అర్హులు నష్టపోకుండా చూడాలి.అందువల్ల పై సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి మండల పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరిందాలని మనవి చేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షులు
బీరక సాయిశ్రీను, కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల వెంకట్ రెడ్డి , రాష్ట కౌన్సిల్ మెంబర్ గుగులోత్ బాలు నాయక్, జిల్లానాయకులు బిజ్జం శ్రీనివాస రెడ్డి, చుక్కపల్లి బాలాజీ,కేశగాని శ్రీనివాస్ గౌడ్,జిల్లా యువమోర్చ నాయకులు బానోత్ వెంకటేశ్వర్లు, గని బోయిన శ్రీను, బిజ్జం వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ మేకల నరసింహరావు, మండల ప్రధానకార్యదర్శి వెలిశెట్టి రామారావు, జక్కం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు