లారీ బైకు ఢీ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

* రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రోడ్డు విస్తీర్ణం లేకే ప్రమాదాలకు కారణం * దుకాణాల ముందు ఆక్రమణకు గురైన రోడ్డు వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారిన రహదారి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 18, 2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ గోనెగండ్ల మండలం పరిధిలోని రోడ్డు ప్రమాద సంఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికులు వివరాల మేరకు, గోనెగండ్ల గ్రామానికి చెందిన మద్దమ్మ కుమారుడు, బోయ మునుస్వామి, 30ఏళ్ళు మొండి కమ్యూనిటీకి చెందిన వీరేష్ 15 ఏళ్ళు , బ్రతుకు తెరువు కోసం ఉపాధి కొరకు గుంటూరు వెళ్లి తిరిగి సోమవారం రోజు స్వగ్రామానికి చేరుకున్నారు. ఉదయం 10:30 గంటల సమయంలో పనులు నిమిత్తం గంజిహళ్లి రోడ్డు నుండి, ఏపీ 39 జె కివ్ 6383 ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వారి ముందు ఏపీ 21వై 6669 గల 10టైర్ల్ లారీ బైక్ రెండు కర్నూల్ వైపు ప్రయాణిస్తున్నారు.జడ్పీ హైస్కూల్ దాటి 50 మీటర్ల దూరంలో, రెండు వాహనాలు పక్కపక్కనే వెళుతున్న సమయంలో, లారీ ముందు టైర్ కింద ద్విచక్ర వాహనం పడడంతో, ఏకంగా ద్విచక్ర వాహనంపై లారీ వెళ్లడంతో మునిస్వామి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న వీరేష్ ను స్థానికులు హుటా హుటిన ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హాస్పటల్లో కోలుకోలేక మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు మునిస్వామి కు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు, కుమారుడు మృతితో భార్యా, తల్లి రోతనలతో అక్కడున్న వారిని దుఃఖంతో కంట తడి పెట్టించాయి. సమాచారం అందుకున్న పోలీసులకు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని, ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకొని , పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం పంచనామా నిమిత్తం, శవాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. ఈ రహదారి గుండా కర్ణాటక రాష్ట్రం బళ్లారి, రాయచూరు పట్టణలకు వాహనాలు రాకపోకలు సాగించడంతో, రద్దీ ఎక్కువైందని, రోడ్డు మాత్రం గ్రామానికి వెళ్లే రహదారిలా, ఇబ్బందికరంగా మారిందన్నారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న షాపులు అంగళ్లు ముందున్న స్థలాలు ఆక్రమణకు గురైయాని, రోడ్డు విస్తీర్ణ పనులు చేపట్టి, మండలం దాటేంతవరకు డబల్ రోడ్డు వేసి మధ్యలో డివైడర్ వెయ్యాలని సామాజిక వేత్తలు సామాజిక మాధ్యమాల్లో, పత్రికా కథనాల ద్వారా ఎన్ని మార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లిన స్పందించకపోవడం, చాలా బాధాకరమని స్థానికులు తెలిపారు. రోడ్డు పనుల విస్తీర్ణంచేయడంలో విఫలమైన అధికారుల నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలి, మృతుల కుటుంబాలకు భరోసా కల్పించేది ఎవరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *