భారీ వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారి వెంట ఉన్న చెట్ల కొమ్మలను తీసివేయడం జరిగింది.. సర్పంచ్ లు..

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి /18: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలములోని వెంకట్రావుపల్లి గ్రామము నుండి సోమారంపేట గ్రామము కు వెళ్ళే రహదారి లో చెట్ల కొమ్మలు చాలా ఉండడం తో ప్రయాణానికి ఇబ్బందులు కలుగుతున్నాయని మానకొండూరు నియోజక వర్గ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఆదేశం మేరకు ఈ రోజు సోమారంపేట సర్పంచ్ లక్ష్మ రెడ్డి మరియు వెంకట్రావుపల్లి సర్పంచ్ అయిన నవీన్ కుమార్ అనే మేము ఇరువురము కలిసి గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్ల కొమ్మలను మిషన్ ద్వారా తీసి వేయడం జరిగింది అలాగే చెట్ల కొమ్మలను మాత్రమే తీసివేయడం జరుగుతుంది. కాబట్టి చెట్లు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి ఒక రహదారి వెంట ప్రయాణికులకు మరియు బస్సులు బారి వాహనాలు వెళ్ళే వారికి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అని సర్పంచ్లు నవీన్ కుమార్.లక్ష్మారెడ్డి లు అన్నారు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *