రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేయాలంటూ వినతి.

* తహసిల్దార్ కు వినతి పత్రం అందిస్తున్న బిజెపి నేతలు.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 18 సాలూర : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను సంపూర్ణంగా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో మండల ఇంచార్జ్ తహసిల్దార్ సురేందర్ నాయక్ కు వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా మండల బిజెపి అధ్యక్షులు రావుబా గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హామీల వర్షం కురిపించి గద్దెనెక్కిందని,ఈ సందర్భం వారు అధికారం చేపట్టిన నుంచి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడమే నిదర్శనం అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసి లబ్ధిదారులకు అందించాలని కోరారు.బిజెపి ప్రజల పక్షాన ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి సంక్షేమ పథకాలను అమలు చేయిస్తామనిహెచ్చరించారు.మండల బిజెపి శాఖ ఇచ్చిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి చేర్చాలని తహసిల్దార్ కు విన్నవించారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ప్రకాష్, రమేష్ నాయకులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *