పయనించే సూర్యుడు మార్చి 18 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల పరిధిలోని రావులచెరువు తాండలో ఈరోజు నూతన సీసీ రోడ్ల పనులకు ఘనంగా శ్రీకారం చుట్టారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, సీసీ రోడ్ల నిర్మాణం గ్రామ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని, ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి తమ వంతు కృషి కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు చురుకుగా పాల్గొని పనులను ప్రారంభించారు. తాండ సర్పంచ్ కృష్ణ నాయక్, ఉపసర్పంచ్ విజయ్ కుమార్ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. అలాగే జంపాల్య మురళి నాయక్, మోహన్ రాజు నాయక్, సోమ్లా నాయక్, దాసు నాయక్, చరణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.