వేల మంది పోటీపడ్డ దేవుడు మీకే అవకాశం ఇచ్చారు దానిని సద్వినియోగపరచుకోండి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

*మహిళా అంటే ఆదిపరాశక్తి ఎన్నికైన మహిళ కౌన్సిలర్లు ఈ ఐదు సంవత్సరాలలో ఎటువంటి సమస్య లేకుండా అభివృద్ధి చేయాలి. *కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి . *వేసవి ముంచుకొస్తోంది చౌటుప్పల్ పట్టణంలో తాగునీటి ఎద్దటి లేకుండా చూసుకోవాలి. *నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సూచన. *అనంతరం మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ .

పయనించే సూర్యుడు న్యూస్ చౌటుప్పల్ మార్చి 18. చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ని చైర్మన్ ఛాంబర్ లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ మొగదాల పావని రమేష్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దంపతులకు వేదమంత్రాలతో పూర్ణకుంభంతో పాలకవర్గం సభ్యులకు వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం ఛాంబర్ లో చైర్ పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ ని కుర్చీలో కూర్చోబెట్టి సన్మానించి ఆశీర్వదించారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి అందరిని అభినందిస్తూ ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డి పడిన కష్టాన్ని వివరిస్తూ… చౌటుప్పల్ మున్సిపాలిటీలో చాలామంది మహిళలు గెలిచారని మహిళా అంటే ఆదిపరాశక్తి అని అత్యంత శక్తివంతురాలని ఆ శక్తి తో ఈ ఐదు సంవత్సరాలలో చౌటుప్పల్ మున్సిపాలిటీ లో వున్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేసి చూపించాలన్నారు.. వేలమంది పోటీపడితే మీకు మాత్రమే దేవుడు అవకాశాన్ని కల్పించాడని అవకాశాన్ని ప్రతి ఒక్క కౌన్సిలర్ సభ్యులుగా పరుచుకోవాలని సూచించారు. వేసవి ముంచుకొస్తున్న తరుణంలో చౌటుప్పల్ పట్టణంలో తాగునీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని పాలకవర్గాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో 46 మంది లబ్ధిదారులకు 46 లక్షల 5336 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *