పయనించే సూర్యుడు, మార్చ్ 18, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను అమలు చేయడంలో విఫలమైనందున బీజేపీ ఆధ్వర్యంలో చేత గాని కాంగ్రెస్ ప్రభుత్వం పై బిజెపి పోరుబాట అని దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బచ్చన్నపేట మండల బిజెపి అధ్యక్షుడు బంగారు మహేష్ ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ కి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలకు 100 రోజులలో చట్టబద్ధత కల్పించి అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ రెండు సంవత్సరాలు గడిచిన అందులో ఏ ఒక్క హామీని నెరవేర్చక పోవడం చాలా సిగ్గుచేటని అన్నారు. వెంటనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని అన్నారు. మోసపూరిత వాగ్దానాలు అమలు కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.గత రెండున్నర సంవత్సరాలుగ యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అర్హులైన యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని దీనికోసం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీగా ఉన్నా ఉద్యోగాలను భర్తీ చెయ్యాలని డిమాండ్ చేశారు.వృద్దులకు, వితంతువులకు,వికలాంగులకు కొత్త పెన్సషన్లు వెంటనే మంజూరు చేయాలని,రైతులకు రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని, అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ళను వెంటనే పేదలకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తమ్మడపల్లి సర్పంచ్ బేజాడి సిద్ధులు, మన్ సన్ పల్లి సర్పంచ్ గీస సందీప్, మండల బిజెపి ప్రధాన కార్యదర్శి గద్దరాజు, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కక్కెర్ల గణేష్, మండల నాయకులు అభిషేక్. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.