ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ఆధ్వర్యం లో ఉగాది కవిసమ్మేళనము

పయనించే సూర్యుడు, మార్చి 18 రంగారెడ్డిజిల్లాప్రతినిధి(ఎస్ఎంకుమార్) “పరాభవం భయం వద్దు! పరాభవనామ సంవత్సరంలో అన్నీ పరాభవాలే జరుగు తాయని భయపడాల్సిన అవసరం లేదనీ, ఒక్కోసారి అవమానము కూడా ఒక బహుమానము అవుతుంది అని”* హాస్యబ్రహ్మ శంకరనారాయణ అన్నారు. ” పేరులో ఏముంది పెన్నిధి అని,మన్మధ నామ సంవత్సరములో అందరూ మన్మ ధులయ్యారా? రాక్షసనామ సంవత్సర ములో అందరూ రాక్షసులయ్యారా?” అని చమత్కారంగా ప్రశ్నించారు. ప్రసం గం యావత్తు ఛలోక్తులు కురిపించి హాస్య భరితం చేశారు.శ్రీ పరాభవ నామ సంవ త్సర ఉగాదికి పురస్కరించుకుని చందా నగర్ లో గల శ్రీ విశాఖ శారదాపీఠ పాలి త శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో పాలకమండలి వారి సహ కారంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసో సియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామ స్వామి యాదవ్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహిం చారు. ఈ కవి సమ్మేళనాన్ని ఆలయ ప్రధాన అర్చకు లు శ్రీ సుదర్శన సత్యసాయి జ్యోతి ప్రదీపనము చేసి ప్రారంభిం చారు.ఈ కవి సమ్మేళ నానికి కళాసింధు డాక్టర్ ఆలపాటి అధ్యక్షత వహించి కార్య క్రమాన్ని రసవ త్తరంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాస్య బ్రహ్మ,పాత్రికే యులు డాక్టర్ శంకరనారా యణ విచ్చేసి ప్రసంగించారు.అతిథులు గా చిత్రకవితా సామ్రాట్ చింతా రామకృ ష్ణారావు,వి ఎస్ ఆర్. సోమయాజులు (సాహితీ విమర్శకులు) ఆర్కిటెక్ట్ ఎండూరి సురేష్ బాబు గార్లు హాజరై వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనాలను నిర్వహించడం అనా దిగా వస్తున్న సనా తన సాంప్రదాయం” అని అన్నారు.” ఉగాది నక్షత్ర గమనానికి ప్రతీక. తన ఊహాశక్తి, కల్పనాశక్తులనే మనోనే త్రాలతో దేనినైనా దర్శించి ముగ్ధ మనోహరముగా,సరళంగా,భావయు క్తంగా, వచన, పద్యరూపాలలో వెల్ల డించే వాడే కవి”* అని అన్నారు.”కవి నిత్య నూతన సృష్టి చేస్తూ ఉంటాడు. ఈ వసంత ఋతువు నిత్యనూతనానికి ప్రతీక. వసంతకాలమున కలిగేటటు వంటి సహజసిద్ధమైన, ప్రకృతి పరమైన మార్పులకు అనుగుణంగా నూతన ఉత్తేజంతో ప్రతిక్షణం కవిత్వాన్ని పండి స్తాడు. ఈ వసంతంలో మావిచి గురు తినిన కోయల ఎలా హృద్యంగా కూస్తూ ఉంటుందో కవి కూడా నిరంత రము రసాత్మకమైన తన కవితాగానంతో అందరిని ఆనందడోలికలలో మంచె త్తుతూ.హృదయాలనుపరవశింప జేస్తుంటాన్నారు. ఈ సందర్భంగా సుప్రసిద్ధులైన కవికో కిలలు 50 మంది తమ కవితా మాధు ర్యాన్ని పంచిపెట్టి శ్రోతలను మంత్రము గ్ధులను చేశారు. తదనంతరం అతిథు లను, కవులను సాంప్రదాయ బద్దంగా వేదమంత్రాల నడుమ శాలువ,పగడీ, జ్ఞాపికలతో సత్కరించారు.ఈ కార్యక్ర మం ఆర్కిటెక్ట్ ఎండూరి సురేష్ బాబు సౌజన్యంతో నిర్వహించారు.ఈ కార్యక్ర మంలో దేవాలయ పాలక మండలి సభ్యులు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసో సియేషన్ సభ్యులు విజయలక్ష్మి,వాణి సాంబశివ రావు, ఉమా చంద్రశేఖర్, అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ,జనార్ధన్, జీవి, రావు, జిల్ మల్లేష్, నండూరి వెంకటే శ్వర రాజు శివరామ రెడ్డిలతో పాటు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొ న్నారు. తదనంతరం తీర్థ,ప్రసాదాల వినిమయం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *