ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్. చిన్న ఎన్నిక

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 18 రిపోర్టర్ అభి కోసిగి మండలానికి చెందిన ఎస్. చిన్నను ఏఐఎస్ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) రాష్ట్ర సమితి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయనను ఈ పదవికి ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో చిన్న ఎంపికకు ఏకగ్రీవ మద్దతు లభించడం విశేషం. ఇప్పటికే చిన్న విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా, తిరుపతి యూనివర్సిటీ ఇన్చార్జిగా ఏఐఎస్ఎఫ్ బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల సమస్యలపై పలు ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తూ మంచి గుర్తింపు పొందారు. రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎన్నిక కావడం పట్ల చిన్న ఆనందం వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకం ఉంచిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం మరింత కట్టుదిట్టంగా పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. చిన్న ఎన్నికపై స్థానిక నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పదవితో ఆయన విద్యార్థి ఉద్యమంలో మరింత కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *