పయనించే సూర్యుడు న్యూస్ నల్గొండ మార్చి 18 రాబోయే శ్రీ పరభవ నామ సంవత్సర (2026-2027) కాలగమనాన్ని తెలియజేసేలా రూపొందించిన “పెండ్యాల వారి పంచాంగాన్ని” నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఈరోజు జిల్లా కేంద్రంలో ఘనంగా ఆవిష్కరించారు..ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పున్న కైలాష్ నేత మాట్లాడుతూ ఈ క్రింది ముఖ్య అంశాలను ప్రస్తావించారు : సంప్రదాయ పరిరక్షణ : తెలుగు వారి జీవన విధానంలో పంచాంగానికి విడదీయలేని సంబంధం ఉందని, శుభకార్యాల నుండి వ్యవసాయ పనుల వరకు ప్రతి అడుగులోనూ పంచాంగం దిక్సూచిలా పనిచేస్తుందని పేర్కొన్నారు..ప్రజలకు మేలు : పెండ్యాల వారి పంచాంగం అత్యంత ఖచ్చితత్వంతో, సామాన్య ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యేలా ఉండటం అభినందనీయమని కొనియాడారు..శుభాకాంక్షలు : కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో ఉండాలని, ముఖ్యంగా రైతాంగానికి ఈ ఏడాది అత్యంత లాభదాయకంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు..ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో వారితోపాటు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు,ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యులు కురుపాటి గణేష్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నల్లగొండ జిల్లా అధికార ప్రతినిధి పెరిక అంజయ్య, పలు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..