కుక్క అడ్డు రావడంతో బైక్ ప్రమాదం – విద్యార్థికి తీవ్ర గాయాలు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 18 రిపోర్టర్ అభి కౌతాళం మండలం కుంటనహాల్ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు సోమవారం సాయంత్రం ప్రమాదానికి గురయ్యారు. పవన్ కుమార్, మహ్మద్ అలీ పదో తరగతి పరీక్ష రాసి బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా మార్గమధ్యంలో అకస్మాత్తుగా కుక్క అడ్డుగా రావడంతో వాహనం అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో పవన్ కుమార్ తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగళవారం ఉదయం కర్నూలుకు రెఫర్ చేశారు. మహ్మద్ అలీకి స్వల్ప గాయాలు కావడంతో స్థానికంగా చికిత్స అందించారు. ఈ ఘటనపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *