పయనించే సూర్యుడు : మార్చి 19 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణ రాత్రి కురిసిన భారీ వర్షానికి పెద్దరేవల్లి గ్రామం మూడో వార్డు ఎస్సీ కాలనీ చెరువులా మారింది. చినుకు పడితే చిత్తడే అన్నట్టు కాలనిలో వర్షం నీరు చేరడంతో కుంటను మైమరపిస్తుంది. కాలనిలో మౌలిక సదుపాయాలు లేక వర్షపునీలు ఇంటికి అనుకొని ఉండడంతో ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉంది.వర్షం పడితే కాలనీ చెరువును తలపిస్తుంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ఉన్నతాధికారులు ఇలాంటి వాటి పట్ల ప్రత్యేక చర్యలు తీసుకునే విధంగా చొరవ చూపాలి. అదే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా చూసుకోవాలి. కాలనిలో నీరు చెరితే దీని ద్వారా దోమలు, ఈగలు ఇతర పురుగులు క్రిమి కీటకాలతో పాటు విష సర్పాలు వచ్చే ఆస్కారం ఉంది. అలాగే పెద్దరేవల్లి గ్రామం మణికంఠ రైస్ మిల్ యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి మణికంఠ రైస్ మిల్ వాళ్లు రోడ్డు పక్కన నూతన నిర్మాణం చేపడుతూ వర్షపు నీళ్ళు యధావిధిగా ఎప్పుడు వెళ్లినట్టు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తూ నిర్మాణం కొనసాగిస్తున్నారు ఏదైతే మణికంఠ రైస్ మిల్ ముందు కల్వేటు నుంచి వాటర్ గతంలో వెళ్లేవి ఇప్పుడు ఆ యజమాని మొత్తం దాన్ని బ్లాక్ చేయడం ద్వారా వర్షాలు పడ్డప్పుడల్లా నీరు అన్ని ఎస్సీ కాలనీకి చేరుకొని కుంటగా మారుతుంది. అధికారులు దీనిపైన చొరవ తీసుకొని శాశ్వత పరిష్కార మార్గం చూపాలని కోరుతున్నాను