జయప్రద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపులో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, జయప్రద ఫౌండేషన్ చైర్మన్ తొండపు దశరథ జనార్ధన్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 19 జగ్గయ్యపేట పట్టణంలోని కొత్త వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మండపం నందు నియోజకవర్గ వ్యాప్త మీడియా మిత్రులు మరియు వారి కుటుంబ సభ్యుల కొరకు జయప్రద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపులో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, జయప్రద ఫౌండేషన్ చైర్మన్ తొండపు దశరథ జనార్ధన్ ,జీరో పావర్టీ పి4 వైస్ చైర్ పర్సన్ కుటుంబరావు పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్ ద్వారా పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *