ప్రోటోకాల్ పాటించలేదని అడిషనల్ కలెక్టర్ కు పిరియద్

6 వ వార్డ్ కౌన్సులర్ శ్రీలత

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 19 మంథని నియోజకవర్గం మంథని లో ప్రోటోకాల్ ఉల్లంఘించి బీసీ మహిళ కౌన్సిలర్ ను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీలత అన్నారు మొన్న మంథని మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో ఆరవ వార్డు బోయినపేట్ కౌన్సిలర్ గా 474 ఓట్ల భారీ మెజారిటీతో జిల్లా స్థాయిలో అధ్యధిక రికార్డు మెజార్టీతో గెలుపొందాను.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమములో భాగంగా తేదీ: 17-03-2026 మంగళవారం మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యములో ఆరవ వార్డు పరిధిలోని బోయిని పేట్ తెనుగు వాడ, గొల్ల గూడెం, దుబ్బగూడెం లలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమము నిర్వహించారు. కానీ ఆరవ వార్డు కౌన్సిలర్ అయిన నాకు సమాచారం ఇవ్వకుండా, ప్రోటోకాల్ ఉల్లంఘించి ఒక బీసీ మహిళ ప్రతినిధినైనా నన్ను కావాలనే తీవ్రంగా అవమానించారు.. అయినా నాకు సమాచారం తెలియగానే నేను ఉదయం 6:00 నుండి సాయంత్రం వరకు మున్సిపల్ పరిశుద్ధ కార్మికులతో దగ్గరుండి పనులు చేయించుకుంటూ ఉన్నాను.బోయిన్ పేటలో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మున్సిపల్ కార్యాలయం నుండి అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కానీ అందులో ప్రజలతో ఎన్నుకోబడ్డ ఈ వార్డు కౌన్సిలర్ అయినా నన్ను విస్మరించి ఉద్దేశపూర్వకంగానే నా పేరు రాయకుండా నాపై పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి భర్త పేరు ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లను మరియు బి ఆర్ ఎస్ నాయకున్ని కాంగ్రెస్ నాయకులు అని వారి పేర్లను మాత్రమే పెట్టి నన్ను తీవ్రంగా అవమానించారు.. ఈ కార్యక్రమంలో బాధ్యతారహితంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకొని ఇకనుండి ప్రోటోకాల్ ఉల్లంఘించకుండా చూసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *