ముగిసింది 5 ఏళ్ల కౌన్సిలర్ పదవి మాత్రమే

ఫయాజ్ అహ్మద్ నిజమైన ప్రజా సేవకుడు.

పయనించే సూర్యుడు మార్చ్ 19 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఈ 5 ఏళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు, మధుర జ్ఞాపకాలు, కొన్ని చేదు అనుభవాలు, సంతోషాలు, బాధలు ఎదుర్కొన్నాను.ఊపిరి ఉన్నంత వరకు ఆదోని పట్టణం, ముఖ్యంగా 40వ వార్డు పరిధిలోని నిజాముద్దీన్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, హెచ్.పి గ్యాస్ లైన్, ఎన్‌టిఆర్ నగర్, ఖాజీ గడ్డ, మైనార్టీ కాలనీ ప్రజల సేవకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను. కౌన్సిల్ సమావేశాల్లో నా 40వ వార్డు ప్రాంతాలైన నిజాముద్దీన్ కాలనీ, ఖాజీ గడ్డ, హెచ్.పి గ్యాస్ లైన్, ఎన్‌టిఆర్ నగర్, వెంకటేశ్వర కాలనీ, మైనార్టీ కాలనీల ప్రజా సమస్యల పరిష్కారం & అభివృద్ధి కోసం సుమారు కోట్ల రూపాయల పనులు (రోడ్లు, డ్రైన్లు, మరుగుదొడ్లు, సచివాలయాలు, పైప్‌లైన్స్) మంజూరు చేయించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.ఈ అవకాశం కల్పించిన వైఎస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి, నా మీద నమ్మకం ఉంచి, మా నాన్న మరణం తరువాత నాకు కౌన్సిలర్ సీటు కేటాయించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కి,యూత్ ఐకాన్ జయ మనోజ్ రెడ్డి కి,* నా గెలుపుకు అన్నివిధాలుగా సహకరించిన అబ్దుల్ రషీద్ కి, మరియు నా సహచర నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా 40వ వార్డు ప్రజలకు, నా మిత్రులకు జీవితాంతం రుణపడి ఉంటాను. గత ఐదేళ్లలో నాతో కలిసి పనిచేసిన ఆదోని మునిసిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, గత కమిషనర్లు, మా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మున్సిపల్ శానిటరీ, హెల్త్, రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు మరియు సిబ్బంది, మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆర్. ఫయాజ్ అహ్మద్ నిజామి, మున్సిపల్ కౌన్సిలర్, వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, నిజాముద్దీన్ కాలనీ, ఆదోని…నా హయాంలో జరిగిన అభివృద్ధి పనులు:- నిజాముద్దీన్ కాలనీలో మెయిన్ బీటీ రోడ్ నిర్మాణం పూర్తి చేయించడం జరిగింది. వెంకటేశ్వర కాలనీలో బీటీ రోడ్ మరియు డ్రైనేజీ నిర్మాణం చేయించడం జరిగింది. హెచ్.పీ గ్యాస్ లైన్ నుంచి కబ్రిస్తాన్, ఇద్గా వెళ్లే మార్గం వరకు మెయిన్ బీటీ రోడ్ వేయించడం జరిగింది.కాజీ గడ్డలో దాదాపు 50 సంవత్సరాలుగా లేని ఎలక్ట్రిక్ పోల్స్ మరియు స్ట్రీట్ లైట్స్‌ను నా హయాంలో ఏర్పాటు చేయించడం జరిగింది. వెంకటేశ్వర కాలనీ, ఎన్‌టీఆర్ నగర్, దబర్ గుంట ప్రాంతాల్లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి కొత్తగా త్రీ-ఫేజ్ లైన్ మరియు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించడం జరిగింది. మైనార్టీ కాలనీలో బీటీ రోడ్ మరియు డ్రైనేజీ నిర్మాణం చేయించడం జరిగింది. మైనార్టీ కాలనీలో విద్యార్థుల కోసం గవర్నమెంట్ స్కూల్ తీసుకురావడం జరిగింది. మైనార్టీ కాలనీ నుంచి రాకపోకలకు సీసీ రోడ్ పనులను ప్రారంభించడం జరిగింది. కాజీ గడ్డ, ఎన్‌టీఆర్ నగర్, వెంకటేశ్వర కాలనీ, హెచ్.పీ గ్యాస్ లైన్ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా 6 అంగుళాల తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు చేయించడం జరిగింది. కౌన్సిల్ లో సాంక్షన్ అయిన ముఖ్య పనులు (కొన్ని నిర్లక్ష్యం వల్ల పెండింగ్) నిజాముద్దీన్ కాలనీలో మురుగుదొడ్ల నిర్మాణానికి రూ. 25 లక్షలు సాంక్షన్ చేయించడం జరిగింది. నిజాముద్దీన్ కాలనీ డ్రైనేజీ అభివృద్ధికి రూ. 16 లక్షలు సాంక్షన్ చేయించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *