ప్రగతి స్కూల్లో మెరిసిన పల్లెటూరి ఆణిముత్యం

* క్రమశిక్షణతో కూడిన విద్య అయాన్ వేదిక్ జీవితాన్ని మార్చేసింది. * నవోదయలో4వ రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించిన అయాన్ వేదిక్ * తల్లిదండ్రుల కష్టం,అయాన్ వేదిక్ పట్టుదల ప్రగతి స్కూల్ విద్య బోధన.

పయనించే సూర్యుడు ,మార్చి 19, బూర్గంపాడు మండలం రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ బూర్గంపాడు మండలం సోంపల్లి ( గండ్రగొడ్లపల్లి ) గ్రామానికి చెందిన బర్ల రామకృష్ణ,విజయలక్ష్మి దంపతుల కుమారుడు అయాన్ వేదిక్ ప్రగతి స్కూల్ సారపాక నందు 5వతరగతి విద్యనభ్యసిస్తూ, 2026, 6వతరగతి ఎంట్రెన్స్ పరీక్ష నవోదయాలో 4వ ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు,బంధువులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు. అయాన్ వేదిక్ తల్లిదండ్రులు విద్యావంతులు కావడం, ప్రగతి స్కూల్ విద్య బోధన అయాన్ వేదిక్ కు వేదిక అయింది. చిన్ననాటి నుండి చదువుపై మక్కువ ఏదో సాధించాలన్న కసి పట్టుదల అయాన్ జీవితాన్నే మార్చేసింది. (92.50/100) ఉత్తీర్ణత సాధించాలంటే ఎంతో కఠోరమైన శ్రమ, పట్టుదల ఉంటే తప్ప ఈ ఉత్తీర్ణత సాధ్యం కాదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అయాన్ పట్టుదల, ఉపాధ్యాయులకృషి నవోదయ ర్యాంక్ సాధించడంలో అయాన్ కు తోడ్పడింది. ఈ సందర్భంగా ప్రగతి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు చైతన్య మాట్లాడుతూ పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చు, టాలెంట్ ఎవరి సొత్తు కాదని వత్తిడితో కాకుండా ఆసక్తితో చదివితే ఏ విద్యార్థి అయినా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలడని సూచించారు.అయాన్ వేదిక్ ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఒక ప్రణాళికతో వారి ఆశయాలను బంగారు బాటలు వేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *