నవోదయ ప్రవేశ పరీక్ష లో సీటు సాధించిన విజన్ విద్యార్థి ఇషానా రెడ్డి..

పయనించే సూర్యుడు న్యూస్ 19 జవహర్ నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో యాడికి పట్టణానికి చెందిన గంగ శేఖర్ రెడ్డి కుమార్తె ఇషానా రెడ్డి 93.75 మార్కులతో నవోదయ ప్రవేశ పరీక్ష లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి అడ్మిషన్ పొందడం జరిగింది.. ఈ సందర్భంగా ఇశానారెడ్డిని విజన్ విద్యాసంస్థల కరస్పాండెంట్ విశ్వనాథ్ అభినందించడం జరిగింది . అలాగే కుమార్తెను ఎంతగానో ప్రోత్సహించిన గంగ శేఖర్ రెడ్డి గారిని సన్మానించడం జరిగింది. నవోదయ ప్రవేశ పరీక్షలో దాదాపు పది మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సాధించినప్పటికీ సీట్లు తక్కువగా ఉన్నందున అడ్మిషన్ పొందలేకపోయారు అని పాఠశాల యాజమాన్యం పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో విజన్ ఉపాధ్యాయ బృందం అమర్, శేఖర్, కోటి మరియు విజన్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *