ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణం

పయనించే సూర్యుడు మార్చ్ 19 (ప్రతినిధి జి సుధాకర్ డిండి మండలం నల్గొండ జిల్లా) డిండి మండలంలోని కుందేలు బాయ్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని అనుమతి లేకుండా 33 ఫీట్ల నక్ష రోడ్డు లో ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణం చేస్తున్నారు. గ్రామపంచాయతీ నుండి అక్రమంగా నిర్మిస్తున్నారని నోటీసులు ఇచ్చిన నేను అధికారిని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోవాలని సమాధానం చెబుతున్నారు. దయచేసి ఇట్టి ఇంటి నిర్మాణం నిలుపుదల చేసి సదర్ వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామ సర్పంచి కాట్రావత్ వెంకట్రాం, గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు. లేనిపక్షంలో పై అధికారులను ఆశ్రయించి ప్రభుత్వ భూమిని కాపాడుతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *