కబరాస్థాన్ లో మొక్కలు నాటాలని ఎంపీడీవో, సర్పంచ్ లకు వినతి..

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 19, తల్లాడ రిపోర్టర్ తల్లాడలోని ముస్లింల కబరాస్థాన్ లో మొక్కలు నాటాలని ఎంపీడీవో శ్రీధర్ రాజు, సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు(చిన్నబ్బాయి)కి తల్లాడ వాసి షేక్. మెహరాజ్ వినతి పత్రం అందించారు. బుధవారం సర్పంచ్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో వారికి ఆయన వినతిని అందించారు. కల్లూరు రోడ్ లోని ప్రధాన రహదారి పక్కన నూతనంగా ముస్లింల కబరాస్థాన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ ప్రాంతంలో మొక్కలు నాటాలని విన్నవించారు. స్పందించిన అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి మొక్కలు నాటే విధంగా తన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ గ్రామసభలో తల్లాడ ఈవో కృష్ణారావు, ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *