30 ఏళ్ల తర్వాత గొల్లపెల్లిలో చారిత్రక ఘట్టం

* శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి’ ఆలయ కమిటీ ఎన్నిక

పయనించే సూర్యుడు19-3-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో బుధవారం ఒక అరుదైన, శుభప్రదమైన ఘట్టం చోటుచేసుకుంది. సుమారు మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి ఆలయ కమిటీని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ​ఆలయ అభివృద్ధి, నిర్వహణ కోసం బాధ్యులుగా ఎన్నుకున్నారు.​అధ్యక్షులు అనంతుల భూమయ్య ​ఉపాధ్యక్షులు శాతల్ల లక్ష్మణ్, అంకం భూమయ్య ​ప్రధాన కార్యదర్శి గడ్డం గంగాధర్ ​కార్యదర్శులు గంగాధర మధుసూదన్, ఓర్సు రవి. ​కోశాధికారి కాలువ శ్రీనివాస్ ​సహాయ కోశాధికారి అంకం సతీష్ ​కార్యవర్గ సభ్యులు గా కొలగాని ఉమేష్, ఆవుల వెంకటేష్, వేల్పుల రాము ​ఆలయ ఉత్సాహ కమిటీ ఎన్నిక ​ప్రధాన కమిటీతో పాటు ఆలయ ఉత్సవాలను, కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘ఉత్సాహ కమిటీ’ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ ప్రధాన సహాల దారులుగా తాడూరి సత్యనారాయణ, గురుజల బుచ్చిరెడ్డి, కట్ట మహేష్ ఉత్సాహ కమిటీ అధ్యక్షులుగా తాడూరి వంశీకృష్ణ ఉపాధ్యక్షులుగా సంఘం కళ్యాణ్, ప్రధాన కార్యదర్శిగా చెవుల మద్ది శ్రీనివాస్, కోశాధికారిగా ఐతర వేణి మధు కార్యవర్గ సభ్యులుగా, బుచ్చిరెడ్డి, శ్యాంసుందర్, రమేష్, కొమురయ్య, అనిల్ రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవి కాలం ఇప్పటినుండి రెండు సంవత్సరాలు కొనసాగుతుందని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి కట్టుబడి కమిటీ సభ్యులు ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు భూమయ్య మాట్లాడుతూ.. ఇప్పటినుండి రామాలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తామని నాపై నమ్మకం ఉంచిన బాధ్యతలు అప్ప చెప్పిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీరజ సతీష్ రెడ్డి, ముస్కు లింగారెడ్డి, కొండల్ రెడ్డి, నారాయణరెడ్డి, చెన్నాడి ఉమేష్ రావు, రాజబాబు, చాడ వెంకటరమణ, ఆవుల రాజశేఖర్, గంగాధర నరేష్, సిరికొండ శ్రీనివాస్,సిరికొండ తిరుపతి, ఎనగందుల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *