చింతకాని రైతు వేదికలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద పనిముట్ల పంపిణీ

పయనించే సూర్యుడు మార్చి 19, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండలంలోని చింతకాని రైతు వేదికలో ఈరోజు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు వివిధ వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోటవేటర్లు, కల్టివేటర్లు, ప్లౌలు, బ్రష్ కట్టర్లు, పవర్ వీడర్లు, పవర్ స్ప్రేయర్లు రైతులకు అందజేశారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సోములపల్లి మానస మాట్లాడుతూ, దాదాపు పది సంవత్సరాల తర్వాత ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకం ద్వారా చిన్న మరియు సన్నకారు రైతులకు 50 శాతం సబ్సిడీపై, పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను అందిస్తున్నామని చెప్పారు.ఏఎంసీ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు, ఆత్మ డైరెక్టర్ కొప్పుల గోవిందరావు మాట్లాడుతూ, రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే ఈ పథకాన్ని పునరుద్ధరించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *