పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 19 బోధన్ : బోధన్ పట్టణంలోని హోటల్లో గురువారం సబ్సిడీ గ్యాస్ సిలిండర్ లను అధికారులు పట్టుకున్నారు రెవిన్యూ అధికారులు బస్టాండ్ సమీపంలో ని హోటల్ పై దాడి చేసి 7 సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ సిబ్బంది సహకారంతో హోటల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు లభించాయి ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ నాగేష్ , ఆర్ఐ హనుమంతు, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు