ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిఆదేశాల మేరకు ఘనంగా “ఈద్ కానుకల” పంపిణీ

పయనించే సూర్యుడు, మార్చి 19 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎంకుమార్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అను ముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని శేరిలింగంపల్లి నియో జకవర్గం మజీద్ బండ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మైనారిటీ సోదరుల కు అందించిన ఈద్ కానుకల పంపిణీ కార్యక్రమం గురువారం అత్యంత వైభ వంగా జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వ హించబడిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డివిజన్ ప్రెసిడెంట్ మొహ మ్మద్ జహంగీర్ డివిజన్ సెక్రటరీ ఎండి. అజామ్, ఐవైసీ డివిజన్ ప్రెసిడెంట్ కోడి చర్ల మహేందర్ (టీంకు), ఇమ్రాన్, రిషి రాయ్,లావణ్ కుమార్, నాగరాజ్ మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారు తమ చేతుల మీదుగా స్థానిక ముస్లిం సోదరులకు ఈద్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కులమతాలకు అతీ తంగా పండుగలను అందరూ సంతో షంగా జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఆశ యమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తు న్న ఈ సహాయం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *