రైతన్న మీకోసం వారోత్సవాలు: రైతులకు అవగాహన, కరపత్రాల పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 19 రిపోర్టర్ అభి మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరులో బుధవారం రైతన్న మీకోసం వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ మంత్రాలయం ఇంచార్జి రాఘవేంద్రారెడ్డి, రాష్ట్ర రైతు ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు సొసైటీ చైర్మన్ మీసేవ ఆంజనేయులు అగ్రికల్చర్ అధికారులు రైతుల ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. రైతులకు కరపత్రాలు పంపిణీ చేసి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ రైతుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *