మంత్రాలయం రైతు అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

* మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకుడు ఆయన కుమారుడు ఎన్.రాకేష్ రెడ్డి పాల్గొన్నారు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 19 రిపోర్టర్ అభి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రైతన్న మీకోసం వారోత్సవాలు కార్యక్రమం 3వ రోజు బుధవారం కౌతాళం టౌన్‌లో విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకుడు ఆయన కుమారుడు ఎన్.రాకేష్ పాల్గొన్నారు. రైతుల ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి, రైతుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రతి రైతుకు పథకాల ప్రయోజనం చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతు అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని వారు తెలిపారు. రైతులకు కరపత్రాలను పంపిణీ చేసి, ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *