పయనించే సూర్యుడు అనకాపల్లి జిల్లా 20.3.2026 రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం 16, 17, 18 మరియు 23 ,24 ,25 తేదీలలో ప్రతి గ్రామాలలో రైతన్న మీకోసం వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు. ఈ ఐదు అంశాలపై ప్రతి రైతు కుటుంబాన్ని సందర్శించి చర్చించడం జరుగుతుంది. ఈ ఐదు అంశాలకు సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖను ప్రతి రైతు కుటుంబానికి అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వేసవిలో పి ఎం డి ఎస్ సాగు విధానాన్ని రైతులు అవలంబించేలా మరియు నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను సాగు చేసే విధంగా రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. గ్ అభ్యుదయ రైతులను టీంలుగా ఏర్పరచడం జరిగింది. ఈ వారోత్సవాలు పూర్తయిన తర్వాత గ్రామాల వారీగా ఖరీఫ్ కి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయడం జరుగుతుంది. హాజరైన వారు ఏ కృష్ణవేణి- మండల వ్యవసాయ అధికారి