డైరీ పార్లర్ ల విస్తృత తనిఖీ

పయనించే సూర్యుడు 20-03-2026 చీడికాడ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు చీడికాడ గ్రామం లో పాలు మరియు పాల పదార్ధాలు అమ్మే షాపులను సహాయ సంచాలకులు డా. చిట్టి నాయుడు, పశు వైద్య శస్త్ర చికిత్స సహాయకులు డా. కె.వి. ఎస్. రాఘవమ్మ , డా. ఏ. సీ హెచ్. ఎస్ . గణేష్ తనిఖీలు చెయ్యడం జరిగింది. పాల ప్యాకెట్లు ఉంచే ఫ్రీజర్లు మరియు పాల ప్యాకెట్ లు, ఇతర పదార్ధాల యొక్క ఎక్స్పయిరీ తేదీలు, ( ఎఫ్ ఎస్ ఎస్ ఐ) ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్లు తనిఖీలు చెయ్యడం జరిగింది. అనధికారికంగా ఎక్కడైనా పాలు మరియు పాల పదార్ధాలు అమ్మకం జరిపితే వెంటనే దగ్గర్లోని పశు వైద్య శాల కు తెలియజెయాలని సూచించడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *