నవోదయ సీటు సాధించిన వగెల సనవీ పల్లవ్

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 20 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల పరిధిలోని మామిళ్లవారిగూడెం ప్రాధమిక పాఠశాల విద్యార్ధిని వగెల సనవీ పల్లవ్ ఇటీవల నిర్వహించిన నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతి అర్హత పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి పాలేరు నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశం పొందింది. మామిళ్లవారిగూడెం కు చెందిన వగ్గలె నవరత్నరాజు-విజయలక్ష్మి దంపతుల కుమార్తె అయిన సనవీ పల్లవ్ నవోదయ అర్హత పరీక్షలో 91 మార్కులతో 23వ ర్యాంకును సాధించింది. నవోదయకు అర్హత పొందిన విద్యార్థినిని ఎంఇఒ ప్ర సాదరావు, పాఠశాల ప్రధానోపాధ్యా యులు నరసింహం, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *