పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 21,తల్లాడ రిపోర్టర్ మండల పరిధిలోని మల్లవరం గ్రామంలో ఆర్.సి.యం చర్చి ఫాదర్స్ అజయ్, మరిఅన్నా విన్సెంట్,ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సిలువ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిలువ మార్గంలో భాగంగా 14 స్థలాలలో మరియమ్మ తల్లిని,ఏసుప్రభును,స్మరిస్తూ సిలువను మోస్తూ పాటలు పాడుతూ వాక్యం చదువుతూ, ఊరు ఊరంతా కలయ తిరుగుతూ సిలువ మార్గాన్ని ప్రదర్శించారు, అంతరం వాక్య సందేశాన్ని భక్తులకు అందించి,పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పంతులు ఆంధ్రప్ప, ఆనందం విశ్వాసులు, మేడి రామారావు, సుభాషిని /అద్దంకి నరసరావు అద్దంకిప్రసాద్, పింగళి బాలకృష్ణ హరికృష్ణతదితరులు పాల్గొన్నారు.