ఎటపాక సచివాలయం సిబ్బంది ఎక్కడ!?

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.21.2026 ఎటపాక మండలం ఎటపాక సచివాలయం సేవలు ప్రజలకు అందని.ద్రాక్షగా మిగులుతున్నాయి.శుక్రవారం నాడు సచివాలయంలోని పలు సేవల కోసం వచ్చిన ప్రజలు వెనుతిరిగి వెళ్ళటం జరిగింది.ఈ సందర్భంగా సచివాలయంలో పని ఉండి అక్కడికి వెళ్లిన ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీనుకి సైతం ఇదే సమస్య ఎదురయింది.సుమారు 11:30 నుండి 12 గంటల వరకు వెయిట్ చేసిన కార్యాలయం తలుపులు.ఓపెన్ చేసి ఉన్నాయి కానీ సిబ్బంది ఎవరు లేరు.ఎంతోమంది ప్రజలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇలా అయితే ప్రజలకి సచివాలయం ద్వారా.అందాల్సినటువంటి సేవలు ఎలా అందుతాయి.అని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఇక్కడ సిబ్బంది కొరత ఉండటం కూడా ఒక సమస్యగానే ఉందని.గతంలో ఎటపాక సచివాలయంలో సిబ్బంది.కొరత ఉన్న విషయాన్ని తానే స్వయంగా చింతూరు ఐటిడిఏ పి జి ఆర్ ఎస్ నందు ఫిర్యాదు. చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు.ఇక ఉన్న సిబ్బంది కూడా అందుబాటులో లేకపోతే ప్రజలకు తక్షణం అందాల్సినటువంటి సేవలు ఏ విధంగా అందుతాయి.అని ఆయన ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులను ప్రశ్నించారు.ప్రజలకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతోటి సచివాలయ సేవలు ప్రారంభించబడ్డాయని.కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సచివాలయ సేవలు ప్రజలకి అందని ద్రాక్ష గానే ఉంటున్నాయని ఆయన అన్నారు.కారణం ఏది అయినప్పటికీ సిబ్బంది కార్యాలయంలో లేకపోవడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందని.ఇప్పటికైనా ఉన్నత అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్,పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీరాజ్ శాఖ మరియు ఉప ముఖ్యమంత్రి వారికి ఫిర్యాదు.చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కుంజా శ్రీను ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *