
పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 21 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలే పార్టీ కి వెన్నెముక అని, వారి సమన్వయంతోనే భవిష్యత్ విజయాలు సాధ్యమవుతాయని పలాస నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి అన్నారు. పలాస పార్టీ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ స్థాయి క్లస్టర్, యూనిట్, మరియు బూత్ కన్వీనర్లు, కో-కన్వీనర్లతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందనీ. బూత్ స్థాయి నుండి మనమంతా ఒకే కుటుంబంలా కలిసికట్టుగా పనిచేసి, పార్టీని మరింత పటిష్టం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. యోజకవర్గంలోని ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకొని, వారికి అండగా నిలవాలని ఆయన సూచించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఇలాంటి సమావేశాలు ఎంతగానో దోహదపడతాయని, రాబోయే రోజుల్లో పార్టీ విజయానికి కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేసే కార్యక్రమాలని ప్రజల్లోనికి బలంగా తీసుకోవాలని వారు సూచించారు. ముఖ్యఅంశాలు: రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ROBs): ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉన్న పలాస నిర్మాణానికి ₹46 కోట్లు, తాళభద్ర వద్ద మరో కోసం ₹74 కోట్లు కేటాయించి పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రోడ్ల అభివృద్ధి: పలాస-కాశీబుగ్గ ప్రధాన రహదారిని 100 అడుగులకు వెడల్పు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి స్థానిక ప్రజల సహకారం అవసరమని కోరారు. కేంద్రీయ విద్యాలయం: పలాసకు మంజూరైన కేంద్రీయ విద్యాలయంలో తాత్కాలిక భవనాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభించి, తరగతులు మొదలుపెడుతున్నామని వెల్లడించారు. మత్స్యకారుల సంక్షేమం: “మత్స్య సాగర మాల” పథకం కింద 100కు పైగా మత్స్యకార గ్రామాల్లో 1,600 సోలార్ లైట్లు, బీచ్ రోడ్ల నిర్మాణం చేపట్టామని, దీనివల్ల సముద్ర తీర గ్రామాల రూపురేఖలు మారతాయని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార ఆధునికీకరణ ద్వారా పలాస, ఇచ్చాపురం ప్రాంతాలకు రెండు పంటలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పారిశ్రామిక అభివృద్ధి: పలాస ఇండస్ట్రియల్ పార్కులో రోడ్లు, మౌలిక వసతులు కల్పించి, పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తామన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ స్థాయిల కన్వీనర్లు, కో-కన్వీనర్లు, ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.