రాష్ట్రంలో…మైనార్టీలను అణగదొక్కిన కేసీఆర్

* కేసీఆర్ కామారెడ్డి బదులుగా రాజాసింగ్ పై పోటీ చేయాల్సింది * 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుంది

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 21గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ గజ్వెల్ పట్టణంలో ని మదీనా మజీద్ లో పవిత్ర రామజన్ పండుగ శుభ సందర్బంగా ముఖ్య అతిగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య సలహా దారుడు హాజరై ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలను మాజీ సీఎం కెసిఆర్ అనగదొక్కగా, ఆయన కామారెడ్డికి బదులుగా రాజాసింగ్ పై పోటీ చేస్తే బాగుండేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి, మజీద్ కమిటీ చైర్మన్ సయ్యద్ మతిన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు ఒరిగిందేమీ లేదని, నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివoగత వైయస్సార్, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. అయితే ఆ రిజర్వేషన్ ఫలాలు మైనార్టీలకు చేరగా, సీఎం రేవంత్ రెడ్డి కృషి ఫలితంగా ప్రస్తుతం పరోక్షంగా 9 శాతం వరకు ప్రయోజనం జరుగుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేయగా, పేదరిక నిర్మూలన, సబ్సిడీ ఆదారిత పథకాల వర్తింపు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, మైనార్టీ గురుకులాలు, షాదీ ముబారక్, పేద మైనార్టీలకు ఉన్నత చదువులు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తదితర కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ మోహన్, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్, నాచగిరి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రవీందర్ గుప్త, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, పంచాయతీ రాజ్ అభియాన్ సంఘటన జిల్లా అధ్యక్షులు కడపల నర్సింహ, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కాగా మొదటగా మజీద్ కమిటీ చైర్మన్ సయ్యద్ మతిన్, మాజీ చైర్మన్ సాజిద్ బేగ్ ఆధ్వర్యంలో ఆయనకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేయగా, కబ్రస్తాన్ ఏర్పాటుకు స్థలం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు మంజూరుకు సానుకూలంగా స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తెస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *