23, 24, 25 తేదీలలో సీతారామ కల్యాణ మహోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు-21-03-2026-రాజంపేట న్యూస్ : కాశినాయన మండలం నాయన పల్లి గ్రామంలో వెలసిన శ్రీ కళ్యాణ రామ స్వామి ఆలయం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేడుకలు ఈనెల 23, 24, 25 తేదీలలో వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ పెద్దలు, గ్రామస్తులు తెలియజేశారు. 23 వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దేవుని పూజా కార్యక్రమాలు జరుగుతాయని, రాత్రి 9 గంటల నుండి నాయునపల్లె మహిళల కోలాటం, చెక్క భజన గాన కోకిల గురువు మున్నెల్లి భజన ఓబులేసు వారి బృందముతో చెక్కభజన కార్యక్రమం జరుగుతుందని, 24 వ తేదీ ఉదయం 9 గంటలకు స్వామి వారి విగ్రహాల గ్రామోత్సవం అనంతరం రాత్రి 9 గంటల వరకు పూజా కార్యక్రమాలు, రాత్రి 9 గంటల నుండి డ్రామా కార్యక్రమం ఉంటుందని అన్నారు. 25 వ తేదీన ఉదయం 8 నుండి స్వామి వారి కళ్యాణ మహోత్సవం, అనంతరం అదేరోజు తిరునాల కార్యక్రమంతో ముగుస్తుందని, మూడు రోజులు పాటు మూడు పూటల అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ మహత్తర కార్యక్రమంలో నాయనపల్లి గ్రామం ప్రజలు, భక్తులంతా భాగస్వాములు కావాల్సిందిగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *