ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కార గ్రహీతలకు రంగంపేటలో ఘన సన్మానం

దేవీన సిస్టర్స్‌కు నీరాజనం పలికిన అధికారులు, కూటమి నాయకులు అనపర్తి నియోజకవర్గం రంగంపేట జెడ్పీ హైస్కూల్‌లో అట్టహాసంగా ఉగాది పురస్కార గ్రహీతల సత్కారం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 21 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాష్టక ఉగాది పురస్కారాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్న దేవీన సిస్టర్స్ (ధన్యత మరియు శోహిత)కు రంగంపేటలో ఘన సన్మానం జరిగింది. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొంది గ్రామానికి, పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన విద్యార్థినులను అభినందిస్తూ రంగంపేట జెడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం ప్రత్యేక సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పార్థసారధి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రంగంపేట మండలం తహశీల్దార్ ఎంపీడీవో లు పాల్గొని విద్యార్థినులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ చైర్మన్ గెడ్డాడ దుర్గారావు, గ్రామ ఉపసర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ సభ్యులు యలమటి రాంబాబు, రంగంపేట గ్రామ సొసైటీ అధ్యక్షులు గారపాటి రాంబాబు పాల్గొన్నారు. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉండవల్లి గంగాధర్, ఉండవల్లి రవిశంకర్, పోతుల సత్యనారాయణ, మల్లిపూడి వెంకటరమణ చౌదరి, ఉండవల్లి శివప్రసాద్, ఉండవల్లి వెంకటరావు, ఉపాధ్యాయులు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థినులను ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *