ఆరు హామీలు ఎక్కడ కాంగ్రెస్ మోసం బట్టబయలు – నిర్మల్ జిల్లా బీజేపీ తీవ్ర హెచ్చరిక

పయనించే సూర్యుడు మార్చ్ 20 నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ సీనియర్ నాయకుడు రావుల రామనాథ్, మెడిసం రాజు పార్టీ నాయకులు మరియు కార్యకర్తల తో జిల్లా అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇచ్చిందని, వెంటనే ఆ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పేదలు, రైతులు, యువతకు ఉపయోగపడే ఈ హామీలు అమలు చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇకపై కూడా ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. శాంతియుత మార్గంలో ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమాలు అవసరమైతే మరింత తీవ్రతరమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా పరిపాలన వెంటనే స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *