విద్యారంగానికి బడ్జెట్ లో మొండి చెయ్యి

సీఎం రేవంత్ రెడ్డి వద్దనే విద్యాశాఖ ఉన్నప్పటికీ విద్యారంగానికి అన్యాయం విద్య రంగాన్ని విస్మరించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అరకోరా నిధులు ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహాన్

పయనించే సూర్యుడు మార్చి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో విద్యారంగానికి కేటాయించిన నిధులను చూస్తే అర్థమవుతుందని ఇది ముమ్మాటికి విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం మేనని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 8.22% అంటే 26,674 కోట్ల నిధులు కేటాయించడంలోనే విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తు శుద్ధి ఉందని తెలిసిందన్నారు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో డొల్లతనం కనిపిస్తుంది అన్నారు కనీసం విద్యారంగానికి కేటాయించాల్సిన మినిమం బడ్జెట్ను కూడా విద్యారంగని కేటాయించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఈల అయితే ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట ఎక్కడ వేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో కనీసం 15% నిధులు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఈ సంవత్సరానికి 8.22% మాత్రమే కేటాయించడం దారుణం అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పదివేల కోట్ల పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వ మాత్రం కేవలం
పెండింగ్ స్కాలర్ షిప్స్ ఫీజు రీయంబర్స్ 4.343 కోట్లు కేటాయించి చేతులు దులుపుకోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయానికి 400 కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలో ఉన్న మిగతా విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏంటని
రాష్ట్రంలో ఉన్న ఉన్నత విశ్వవిద్యాలయాలకు తక్కువ నిధులు. కేటాయించడం తగదు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు. సుమారుగా 5000 కోట్ల రూపాయలను కేటాయిస్తే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పరిస్థితి ఏంటి. సంక్షేమ వసతి గృహాలు. కస్తూరిబా ప్రభుత్వ పాఠశాల ఊసే లేదుఅన్నారు డిగ్రీ కళాశాలలు, ఇంటర్నేషనల్ పాఠశాలలు, స్వంత భవనాలు నిధులు లేవు. ఈ నిధులు విద్యా అభివృద్ధి కోసం కాదు ,విద్యా దారిద్య్రానికి దారి తీస్తాయని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 30%అధిక నిధులు కేటాయించి విద్యారంగా అభివృద్ధికి పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ఆయన కోరారు.. లేనియెడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *