చింతకానిలో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం ప్రారంభం

పయనించే సూర్యుడు మార్చి 21, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చింతకాని మండల కేంద్రంలో మక్క రైతులకు ఊరట కలిగించే విధంగా మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. PACS చింతకాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మత్కేపల్లి ఏఎంసీ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన మక్కకు సరైన మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మధ్యవర్తుల ఇబ్బందులు లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిలారు మనోహర్, కిసాన్ సెల్ బాధ్యులు కొప్పుల గోవిందరావు, వ్యవసాయ అధికారి (ఏవో) మనసా, పిఎసిఎస్ సీఈఓ శ్రీనివాస్, ఆర్ఐ, ఏఎంసీ ఖమ్మం మాజీ వైస్ చైర్మన్ మాడుపల్లి భాస్కర్, ఐక్య రైతు సంఘం నాయకులు కోలేటి నాగేశ్వరావు, మక్క రైతు సంఘం మండల అధ్యక్షుడు కూచిపూడి విజయ్, కార్యదర్శి నాగయ్య నారపోగు, ఉపాధ్యక్షుడు మోహన్ రావు పోలూరి, సహాయ కార్యదర్శి ప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్ ఖాజీ, మజీద్, నాగేశ్వరావు, రామారావు, రైతు సంఘం కోశాధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు, పిఎసిఎస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్రాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *