పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 21 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు, పిఆర్సీ ప్రస్తావన లేకపోవడం దారుణం అని,ఉద్యోగుల ఆరోగ్య పథకం క్రింద ఉచిత వైద్యం స్వాగతించాల్సిన అంశమే అయినా నిర్ధిష్ట నిధులు సరిపోవు అని,2026 – 27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ 3,24,234 కోట్ల బడ్జెట్ లో విద్య, మానవ వనరులకు కేటాయించింది 26,674 కోట్లు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్లో 8.2% అని, గత సంవత్సరం కంటే రూ 3,566 కోట్లు అదనంగా కేటాయించినప్పటికీ పెంచిన మొత్తం బ్రేక్ ఫాస్ట్, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజన పథకం విస్తరణ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు విటన్నిటి కోసంసరిపోవు అని,విద్యకు 15% కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ వరుసగా మూడవ బడ్జెట్ లో కూడా నెరవేరలేదు అని, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను సమీక్షించి కనీసం 18% కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ చేగుంట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావుల వెంకటేష్, తంగేళ్లపల్లి కృష్ణమూర్తి, తపస్ జిల్లా నాయకులు సురేందర్, దేశపతి కృష్ణమూర్తి, రమేష్, బాల్ శెట్టి రేఖ,సుమతి, అమరేశ్వరి తదితరులు పాల్గొన్నారు,