బాలానగర్ అంగడి బజార్‌లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు వినతి

పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు మద్యలో విగ్రహం నెలకొల్పాలని తహసీల్దార్‌కు దళిత సంఘాల విన్నపం

పయనించే సూర్యుడు మార్చి 21, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: బాలానగర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ మధ్యలో, పెట్రోల్ బంకుకు ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దళిత, బహుజన సంఘాల నాయకులు మండల తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం , వివిధ దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో బాబాసాహెబ్ విగ్రహం లేని లోటు కనిపిస్తోందని, ప్రధాన కూడలిలో విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా ఆయన ఆశయాలను స్మరించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అంగడి బజారు సమీపంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం (రోడ్డు మధ్యలో) విగ్రహ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని, తక్షణమే అధికారులు స్పందించి అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ప్రతినిధులు, దళిత బహుజన ప్రజా సంఘాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు , స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *