బిజెపి ఆధ్వర్యంలో ఆర్డీవో వినతి పత్రం

పయనించే సూర్యుడు, మార్చి21, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్ వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. దేవరకొండ టౌన్ న్యూస్,ఈరోజు భారతీయ జనతా పార్టీ దేవరకొండ రూరల్ మండలం అధ్యక్షులు నేనా వత్ రాము నాయక్ వారి ఆధ్వర్యంలో ఆర్డీవో కి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్ జిల్లా ఉపాధ్యక్షులు వానం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నెరవేర్చలేని రాష్ట్ర ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది కానీ వాటిలో ఏ ఒక్క హామీ ఇప్పటికి వరకు పూర్తిగా అమలు కాలేదు ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు మరియు దివాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణం పథకం రైతులకు రైతు భరోసా భూ సమస్యల పరిష్కారం వంటి అనేక హామీలు ఇప్పటివరకు కావడం లేదు ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని ఓటు వేసిన ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సమయానికి అందకపోవడంతో రైతులు పెట్టు బడుల కోసం అప్పులపై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాగే నివాస ఆదాయం మరియు కుల ధ్రువీకరణ పత్రాల జారిలో తీవ్ర జాప్యం జరుగుతుంది అనేక ప్రభుత్వ పథకాల కు ఈ పత్రాలు ఇంపార్టెంట్ కావడంతో నిర్ణయిత సమయంలో ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి అర్హులు నష్టపోకుండా చూడాలని పై సమస్యలపై ప్రభుత్వం స్పందించి మండల పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు బెజవాడ శేఖర్, బిజెపి నల్లగొండ జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండాల అంజయ్య, ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అంజి నాయక్, బిజెపి జిల్లా నాయకులు జల్దా భాస్కర్, రెడ్డి శంకర్, జయరామ్, కేలావత్ శంకర్ నాయక్, సిద్దు, సముద్రాల సహదేవ్, ముసిని వెంకటేశ్వర్లు, అవ్వారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *