మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో బి.పావని బాధ్యతలు స్వీకరణ

పయనించే సూర్యుడు మార్చి 21 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఆత్మకూరు ఆర్డీవో బి.పావని బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు మేరకు ఆత్మకూరు ఆర్డీవో బి.పావనికి ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా నియమించారు. దీంతో నేడు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారినిగా బి.పావని బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ మరియు ఇతర సిబ్బందితో మున్సిపాలిటీ పరిపాలన వ్యవహారాలపై చర్చించారు. ముఖ్యంగా పట్టణంలో పారిశుద్ధ నిర్మూలనపై త్రాగునీటి సమస్యపై ఆర్డిఓ బి.పావని ప్రత్యేకంగా చర్చించి పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిందిగా పలు సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *