ఈ నెల 26న నాగర్ కర్నూలు లో ఉచిత కంటి ఆపరేషన్ చికిత్స శిబిరం.

పయనించే సూర్యుడు మార్చి 21 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ జిల్లావైద్యఆరోగ్యశాఖ, జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈనెల 26న గురువారం నాడు ఉదయం 9నుండి 12గంటల వరకు ఉచిత కంటి చికిత్స శిబిరము నిర్వహిస్తున్నట్లు నాగర్ కర్నూలు ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు.నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనం లోని గదినెంబర్ 102లో కంటిశిబిరం ఉదయం 9 నుండి 12గంటల వరకు వచ్చిన రోగులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.శిబిరంలో రోగులకు ప్రత్యేక కంటి పరీక్షలు,సాధారణ పరీక్షలు నిర్వహించి, అందులో అవసరమైన వారికి,క్యాటరాక్టు పొర గలవారికి ఉచితంగా కంటిఆపరేషన్లు మహబూబ్ నగర్ ఏనుగొండ లయన్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రిలో నిర్వహించ నున్నట్లు తెలిపారు.రోగులకు ప్రత్యేక అంబులెన్స్ ద్వార ఏనుగొండకు పంపనున్నట్లుతెలిపారు.రోగులు ముందుగా బి.పి,షుగర్ పరీక్షలు చేసుక్కొని రిపోర్టు వెంటతెచ్చుకోవాలని తెలిపారు. ఈ ప్రాంత రోగులు ఆధార్ కార్డు,రేషన్ కార్డు,ఓటర్ కార్డు,ఏదేని గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీ, ఫోన్ నెంబర్ ని తమవెంట తెచ్చు కోవాలని తెలిపారు.వివరాలకు 9440876556, 7386940480 లో సంప్రదించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *