చలివేంద్రం ప్రారంభం

వాస్విక్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు.

పయనించే సూర్యుడు, మార్చ్ 21, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్ జనగామ జిల్లా బచన్నపేట మండల కేంద్రంలోని చౌరస్తాలో (ఆర్ అండ్ బి) గెస్ట్ హౌస్ అవరణలో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మెన్ నిడిగొండ నరేష్ కుమార్ సూచనల మేరకు చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బచ్చన్నపేట గ్రామ సర్పంచ్ మరియు వాస్విక్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి హాజరై వారి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ అల్వాల నర్సింగ రావు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రయాణికులు, కార్మికులు మరియు సాధారణ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందివ్వడం చాలా గొప్ప కార్యక్రమం అని ఆయన అన్నారు. ఫౌండేషన్ నిర్వాహకులకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఫౌండేషన్ ద్వారా గత ఆరు సంవత్సరాలుగా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని గుర్తు చేశారు.ఈ చలివేంద్రం ద్వారా వేసవికాలం అయిపోయేంతవరకు ప్రతిరోజూ ఉచితంగా చల్లని పరిశుభ్రమైన తాగునీరు అందించబడుతుంది అని స్థానిక ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని వాస్విక్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి తెలిపారు. స్థానిక ప్రజలు హర్షం వ్యక్తంచేస్తూ నిర్వహకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ బచన్నపేట మండల ఇంచార్జి సభ్యులు ఆముదాల భూపాల్ రెడ్డి, నూకల నర్సిరెడ్డి వార్డు మెంబర్లు శివరాత్రి రాజు, పురాణం శ్రీనివాస్, అనిల్, స్థానికులు మహిపాల్ రెడ్డి , గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *