కిందికుంట పార్క్‌లో ఘనంగాఉగాది వేడుకలు: తాజా మాజీ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావుకు సన్మానం

పయనించే సూర్యుడు, మార్చి 21 రంగారెడ్డిజిల్లాప్రతినిధి(ఎస్ఎంకుమార) తెలుగు నూతన సంవత్సరం ‘శ్రీ పరా భవ’ నామ ఉగాది పర్వదినాన్ని పుర స్కరించుకుని హైదర్ నగర్ డివిజన్‌లో. కిందికుంట పార్క్‌లో తెలుగు భాషా ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా కార్పొరేటర్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాం స్కృతిక కార్యక్రమాలు పంచాంగ శ్రవణం స్థానిక ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  ఉగాది సందర్భంగా హైదర్ నగర్ డివి జన్ తాజా మాజీ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావుకి ఈ కార్యక్రమంలో ఘన సన్మానం జరిగింది. డివిజన్ అభివృద్ధికి ఆయన చేసిన విశేష కృషిని ప్రజలకు అందించిన సేవలను గుర్తించి, స్థానిక నివాసితులు నాయకులు ఆయ నను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అభివృద్ధి పనుల ప్రస్తావన: తన పదవీ కాలంలో హైదర్ నగర్ డివిజన్ పరిధి లోని కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన, పార్కుల అభివృద్ధి పారిశుధ్య పనులపై నార్నే శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు గాను ఈ గౌరవం దక్కింద ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల ప్రతినిధులు, తెలుగు భాషా అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు, ప్రజలు పాల్గొని ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *