వైష్ణవి మాత ఆలయంలో శుక్రవారం పూజలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 21.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం, చైత్రమాసం, వసంత నవరాత్రుల్లో రెండవ రోజున ఆలయ అర్చకరాలు శ్రావణి అమ్మవారికి ఉదయమే పంచామృత అభిషేకం చేసి అమ్మవారిని ఎంతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు .చౌడేపల్లి, పుంగనూరు ,రామసముద్రం ,చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు .అమ్మవారి సన్నిధిలో మహిళలు సౌందర్యలహరి పారాయణం ,కుంకుమార్చనలు చేసుకున్నారు.ఈరోజు ఉభయదారులుగా రామసముద్రానికి చెందిన రమేష్ బాబు, సుమలతలు వ్యవహరించారు .ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *