పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-21 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడులను సింగరేణిలో అమలు చేయవద్దని కోరుతూ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం( ఐ ఎఫ్ టి యు ) ఆధ్వర్యంలో భూపాల్ పల్లి పర్సనల్ మేనేజర్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో (ఐ ఎఫ్ టి యు), వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ సింగరేణిలో అమలు చేయవద్దని ఈ లేబర్ కోడ్స్ వల్ల కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని అన్నారు. కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు వేతనాల పెంచుకునే హక్కు సమ్మె చేసే హక్కు తదితర హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని ఈ యొక్క నాలుగు లేబర్ కోడ్స్ లను ప్రభుత్వం వెంటనే వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జి ఎల్ బి కే ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రేడ్స్ ఐ కృష్ణ , ఏ.వెంకన్న ఎస్ సి సి డబ్ల్యూ యు ప్రధాన కార్యదర్శి ఏ.రాజేందర్ ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ నర్సింగ్, రాఇశెట్టి సమ్మయ్య భూపాల్ పల్లి నాయకులు సమ్మయ్య, అవినాష్ నవీన్ దితరులు పాల్గొన్నారు.
