తల్లాడలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 22,తల్లాడ రిపోర్టర్ తల్లాడలో రంజాన్ పర్వదిన వేడుకలను శనివారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తల్లాడకు చెందిన షేక్ మెహరాజ్ రోబో స్వగృహానికి పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక సేమియాలను ఆరగించి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లాడ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు చిన్నబ్బాయి, ఉపసర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి, తల్లాడ నాయకులు గుంటుపల్లి వెంకటయ్య, దగ్గుల శ్రీనివాసరెడ్డి, దుండేటి వీరారెడ్డి, రాయల రాము, ధూపాటి భద్రరాజు, పొన్నం కృష్ణయ్య, చల్ల నాగులు తదితరులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 30 రోజులు పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి పండుగను జరుపుకోవడం సంతోషకరమన్నారు. పలువురు మీడియ మిత్రులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *