పయనించే సూర్యుడు, మార్చి 22 బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపురం గ్రామంలో ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి రంజాన్ వేడుకల్లో మాజీ ఎంపిటిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి మసూద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన సందర్భంలో ఈద్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ అనేది విలువలను ఆలోచించే సమయం అని ఈ పండుగ ప్రతి ఇంటిలో శాంతి, సౌభాగ్యం, సమృద్ధిని,ఐశ్వర్యంతీసుకురావాలని అన్ని సమాజాల మధ్య సోదరభావాన్ని మరింత బలపరచాలని కోరుకుంటున్నానని అందరికీ ఆనందం, ఆరోగ్యం, నిరంతర అభివృద్ధి కలగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగాముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ పెద్దలు గ్రామ ముస్లిం సోదరులు పాల్గొన్నారు.