తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు : కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి .

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 22. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా, తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదరులకు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర నెలలో ప్రార్థనలు, ఉపవాసాలు అందరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు.  పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించి, ఆత్మశుద్ధి మరియు సేవాభావాన్నిపెంపొందించుకున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు… ఈద్-ఉల్-ఫితర్ పండుగ మీ జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు నింపాలని, ఆ అల్లా కృప ఎల్లవేళలా మీ పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *